Veldanda: పీఏసీఎస్ డైరెక్టర్ గంగదారి మల్లేష్‌కు ఘన సన్మానం

Veldanda: వెల్దండ మండల పీఏసీఎస్ డైరెక్టర్‌గా నియమితులైన రాచూరు వాసి గంగదారి మల్లేష్‌ను గ్రామ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Nov 2026 6:36 PM IST
Veldanda
X

Veldanda: పీఏసీఎస్ డైరెక్టర్ గంగదారి మల్లేష్‌కు ఘన సన్మానం

నాగర్ కర్నూలు జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) డైరెక్టర్‌గా నియామకమైన రాచూరు గ్రామానికి చెందిన గంగదారి మల్లేష్‌కు గ్రామ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డైరెక్టర్‌గా నియామకమైన మల్లేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, గుత్తి వెంకటయ్య, రాధాకిషన్, తాజుద్దీన్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY