Veldanda: వెల్దండ కొట్రలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్రలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యేలు కసిరెడ్డి, రాజేష్‌రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
Veldanda: వెల్దండ కొట్రలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం!
నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ: మండల పరిధిలోని కొట్ర గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభంతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, నందీశ్వరుల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కాయితి అశ్విని కాంత్ రెడ్డి తో పాటు సర్పంచ్ శారదా చెన్నయ్య ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. గ్రామానికి చెందిన కాయితి కమల కాంతారావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కాయితి అశ్విని కాంతారావు తన సొంత ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినారు.
ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు అన్న ప్రసాదం అందచేశారు కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సుదర్శన్ రెడ్డి సంజీవ యాదవ్ , మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు మాజీ ఎంపీటీసీ రాములు రవీందర్ రావు సత్యనారాయణ కన్నారావు కృష్ణయ్య తో పాటు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.




