Devarakadra: దేవరకద్రలో ఘనంగా మహాలయ అమావాస్య అన్నప్రసాద వితరణ!
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ఘనంగా అన్నప్రసాద వితరణ.
Devarakadra: దేవరకద్రలో ఘనంగా మహాలయ అమావాస్య అన్నప్రసాద వితరణ!
Devarakadra: మహాలయ అమావాస్యను పురస్కరించుకొని దేవరకద్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం లో భాద్రపద బహుళ అమావాస్య శనివారం రోజు అన్న ప్రసాద దాతలు కీర్తి శేషులు శ్రీ కొండ కనక రెడ్డి, కొండ మాణిక్యమ్మ, శ్రీ కొండ హన్మంత్ రెడ్డి, శ్రీ కొండ అనసూయమ్మ, శ్రీ కొండ కరుణాకర్ రెడ్డి ల జ్ఞాపకార్థం వారి వారసులు కొండ చంద్రకళ, శ్రీ కొండ అంజన్ కుమార్ రెడ్డి, కొండ రాధిక రెడ్డి, కొండ ఆదిత్య కుమార్ రెడ్డి, కొండ నీతా రెడ్డి లు అన్నప్రసాద వితరణ జరిపించారు.
పితృ పక్షాలను పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ జరిపించామని ఈ సందర్భంగా వారు తెలిపారు.మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలను స్మరించుకొని, పూజించుకోవటంతో వారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు నాగరాజు, నాగభూషణం, విశ్వహిందూ పరిషత్ సభ్యులు హనుమంత్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




