Thalakondapally: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్!
Thalakondapally: తలకొండపల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కటికెల శేఖర్ యాదవ్.
Thalakondapally: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్!
తలకొండపల్లి: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను తలకొండపల్లి సర్పంచ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కటికెల శేఖర్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, తెలంగాణ కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారి స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్, గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యం, వార్డు సభ్యులు పోతుగంటి కుమార్, పద్మ కిశోర్, ఇట్టామోని వెంకటేష్, మండల పత్రికా ప్రతినిధులు చంద్రశేఖర్, విష్ణు యాదవ్, వెంకట్ రెడ్డి, ఎరుకలి యాదయ్య, పద్మ విఠల్, నాయిని దేవేందర్, దుగ్గాపురం రవి తదితరులు పాల్గొన్నారు.




