Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల తహసీల్దార్‌కు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను అందజేసిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Nov 2026 12:17 PM IST
Veldanda
X

Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి!

Veldanda: ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్రిషయేషన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్ కి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను రి క్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం శ్రీనివాస్ కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరూ ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు చివరి తేదీ లోపు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పూరి శివకుమార్ లక్ష్మయ్య మట్ట విష్ణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY