Devarkadra: దేవరకద్ర శ్రీవాణి శిశుమందిర్‌లో ఘనంగా గోపాష్టమి వేడుకలు!

Devarkadra: దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీవాణి శిశుమందిర్ పాఠశాలలో గోపాష్టమి సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవు విశిష్టతను వివరించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 17 Nov 2026 12:00 PM IST
Devarkadra
X

Devarkadra: దేవరకద్ర శ్రీవాణి శిశుమందిర్‌లో ఘనంగా గోపాష్టమి వేడుకలు!

Devarkadra: దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీవాణి శిశుమందిర్ పాఠశాలలో గోపాష్టమిని పురస్కరించుకొని గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోవు యొక్క విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు.పర్యావరణానికి పశు సంపద ఉపయోగాలు సకల జీవులపై భూతదయ కలిగి ఉండడం వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిపారు.

హిందూ సంప్రదాయం లో గోవును సకల దేవతా నిలయమనీ పూజించడం అనాదిగా యుగయుగాల నుండి ఆచరిస్తూ, సంరక్షిస్తుండేవారని, కానీ నేటి ఆధునిక యుగంలో గోసంపద తగ్గి వధ శాలలకు పంపబడుతూ గోవుల రక్షణ మృగ్యమైపోయిందని వాపోయారు..గోవులను రక్షించండి, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు కోరారు.

జై గోమాత . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA