Veldanda: బాధితురాలికి రూ.10 వేల సాయం: గోలి శ్రీనివాస్ రెడ్డి
Veldanda: గుండెపోటుతో కోలుకుంటున్న వెల్దండకు చెందిన నాగిళ్ల భారతమ్మను గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, రూ.10,000 తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.
Veldanda: బాధితురాలికి రూ.10 వేల సాయం: గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ల భారతమ్మ గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ *గోలి శ్రీనివాస్ రెడ్డి * భారతమ్మను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తూ, తక్షణ ఆర్థిక సహాయంగా *రూ.10,000 అందజేశారు.*
ఈ కార్యక్రమంలో వెల్దండ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్,చెర్కూర్ సర్పంచ్ శ్రీనివాసులు,మాజీ ఎంపీటీసీ లింగం, మాజీ సర్పంచ్ అంజి నాయక్,మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, వార్డు సభ్యులు జంగిలి సునీత, ఆనంద్, శేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య, సీనియర్ నాయకులు అంజి మాస్టర్, అశోక్ కుమార్, ప్రవీణ్, రాజు, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




