Veldanda: ఆలయ నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి!

Veldanda: ఈదమ్మ బండ తండాలో శ్రీ దుర్గా భవాని మాత, సద్గురు సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణ భూమిపూజలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Nov 2026 1:30 PM IST
Veldanda
X

Veldanda: ఆలయ నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం భక్తి మార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ముక్తి లభిస్తుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండాలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దుర్గా భవాని మాత, సద్గురు సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ పాపిశెట్టి రాము, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి, సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ నిర్మాణ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులతో కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో సమాజంలో సద్భావన, ఐక్యత పెంపొందుతాయని, భక్తి ద్వారానే ముక్తి లభిస్తుందని అన్నారు. దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాకుండా ప్రజల్లో ఆధ్యాత్మికతను, నైతిక విలువలను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సద్గురు సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.

ఆలయ నిర్మాణానికి స్థలం అందజేసిన మాజీ సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమల్ రావు తోపాటు సహకరిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వెంకట్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్ శృతిలయ కల్చర్ అకాడమీ చైర్మన్ చిత్తరంజన్ దాస్ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ నాయకులు నాగులు నాయక్ శ్రీనివాస్ రెడ్డి నిరంజన్ లింగం ముదిరాజ్ ఆనంద్ ప్రవీణ్ సంతోష్ ఆలయ నిర్వాహకులు, దన్ సింగ్ రాజు నాయక్ లక్ష్మణ్ వెంకట్ జన్య దేవ్ జాఫర్ పాండు కిషన్ భక్తులు, , తాండ ప్రజలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY