Veldanda: ఘనంగా లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ!

Veldanda: లింగారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సోమయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Nov 2026 1:20 PM IST
Veldanda
X

Veldanda: ఘనంగా లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి లో గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ సోమయ్య ప్రధమ వర్థంది సందర్భంగా లింగరెడ్డి పల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సోమయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ సోమయ్య సేవలు మరువలేనివున్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మల్లెపాకుల శేఖర్ మొదటి విజేత డామినేటర్ టీమ్ కు బహుమతి నగదు రూ. 20వేలు, రెండవ విజేత లయన్స్ టీం బహుమతి నగదు రూ. 15వేలు, మూడవ బహుమతి రూ. 5 వేలు శేఖర్ అందజేశారు. బహుమతులను గోలి శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుట్ట రాం రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలయ్య, శ్రీనివాస్, జాంగీర్ , అంజి మాస్టర్, మల్లేష్, బొజ్జయ, జంగిలి నిరంజన్, డీలర్ వెంకటయ్య లింగం ముదిరాజ్, రాములు, హనుమంత్, నాగులు నాయక్, వెంకటయ్య, మల్లె పాకుల భాస్కర్, నర్సింహ, నాగేష్, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY