Veldanda: వెల్దండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మరియు ప్రత్యేక గ్రామ సభను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Oct 2026 5:37 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి, ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర అంశాలపై సభలో చర్చించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ ముదిరాజు, మండల పశువైద్యాధికారిణి వనజ, పంచాయతీ కార్యదర్శి ఎ.గిరి గౌడ్ ,

వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, పసునోజు వాణి పురుషోత్తం, గోసుల కొండల్, గుద్దటి కిష్టల్, ముదికొండ కవిత రమేష్, మారేపల్లి మంజుల శ్రీను, పిల్లిదేవేందర్, బాదేపల్లి రమేష్, రేవల్లి మానస రాజు , రవీందర్ రెడ్డి, ఎండి రషీద్, కొయ్యల పుల్లయ్య, తిరుపతి రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY