Achampet: ఈనెల 22న అచ్చంపేటలో గద్దరన్న విగ్రహావిష్కరణ

Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఈనెల 22న ప్రజా యుద్ధనౌక గద్దరన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆవిష్కరించనున్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 7 Nov 2026 8:12 PM IST
Achampet
X

Achampet: ఈనెల 22న అచ్చంపేటలో గద్దరన్న విగ్రహావిష్కరణ

అచ్చంపేట: రోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర గద్దర్ అన్న విగ్రహాన్నికి సంబంధించిన కరపత్రాన్ని విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో మరియు ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు మేధావులు విద్యావంతుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని వర్గాల అన్ని జాతుల నాయకులు ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో గద్దర్ అన్న విగ్రహ కమిటీ సభ్యులు మరియు స్థానిక మండల ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA