Makthal: మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి. రవిబాబు!

Makthal: మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జి. రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Nov 2026 7:26 AM IST
Makthal
X

Makthal: మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి. రవిబాబు!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సీఐ రవిబాబు శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఆయన మక్తల్ సర్కిల్‌కు వచ్చారు.

ఇంతకుముందు మక్తల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సీఐ రామ్ లాల్ బదిలీపై మహబూబ్‌నగర్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో రవిబాబు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతన సీఐ జి. రవిబాబు మాట్లాడుతూ.. మక్తల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని, ప్రజల సమస్యలకు తక్షణ స్పందన అందిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని, అలాగే ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, ఏవైనా సమస్యలు లేదా అసాంఘిక కార్యకలాపాలు గుర్తించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL