Veldanda: వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌కు ఎస్సై నరసింహ్మ ఆత్మీయ సత్కారం!
Veldanda: వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ను గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై నరసింహ్మ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
Veldanda: వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌కు ఎస్సై నరసింహ్మ ఆత్మీయ సత్కారం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం గతంలో వెల్దండ మండలంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన ఎస్సై నరసింహ్మ, నేడు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, ఆత్మీయంగా అభినందించారు. గ్రామ అభివృద్ధి పట్ల ఆమె చూపుతున్న చొరవ, ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎస్సై నరసింహ్మ కొనియాడారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ.. గతంలో వెల్దండ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సై నరసింహ్మ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించారని గుర్తుచేశారు. నాటి పరిచయాన్ని, ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుంచుకుని సోమవారం కలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్, బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్, ఆలీ బాబా తదితరులు పాల్గొన్నారు.




