Kalwakurthy: తర్నికల్ విద్యార్థిని సౌమ్యకు ఎంబీబీఎస్ సీటు.. ఫుడ్ కమిషన్ చైర్మన్ భరోసా

Kalwakurthy: కల్వకుర్తి మండలం తర్నికల్‌కు చెందిన సౌమ్యకు సిద్దిపేటలో ఎంబీబీఎస్ సీటు దక్కింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆర్థిక సాయం ప్రకటించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Oct 2026 3:59 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: తర్నికల్ విద్యార్థిని సౌమ్యకు ఎంబీబీఎస్ సీటు.. ఫుడ్ కమిషన్ చైర్మన్ భరోసా

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం: తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్యకు సిద్దిపేట జిల్లాలో MBBS సీటు లభించిన సందర్భంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

సౌమ్య MBBS విద్యను పూర్తి చేసేందుకు ఐదు సంవత్సరాల పాటు స్టడీ మెటీరియల్‌తో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వట్టేపు బాలయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రుక్ముద్దీన్, వార్డు మెంబర్ బచ్చలకూర మాణిక్యారావు, BRS గ్రామ నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, వర్కలా దేవయ్య, వాటం శ్రీశైలం, వాటం రవి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY