Veldanda: పారిశుద్ధ్య కార్మికుడికి గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ
Veldanda: విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు కొమ్ము రమేష్‌ను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
Veldanda: పారిశుద్ధ్య కార్మికుడికి గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది కొమ్ము రమేష్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై, హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈ విషయాన్ని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ *గోలి శ్రీనివాస్ రెడ్డి * ఆదివారం ఆసుపత్రికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు.
బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా *రూ.10,000 అందజేశారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తదుపరి వైద్య ఖర్చులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ (ఐజాక్ )బొల్లంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమలరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు గుండ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




