Kalwakurthy: కల్వకుర్తి మండలం వేపూర్‌లో పేద కుటుంబాలకు ఉపాధి బండ్ల పంపిణీ!
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం వేపూర్‌లో పేద కుటుంబాలకు ఉపాధి కల్పన కోసం ఫాస్ట్ ఫుడ్ మొబైల్ బండ్లను పంపిణీ చేశారు.
Kalwakurthy: కల్వకుర్తి మండలం వేపూర్‌లో పేద కుటుంబాలకు ఉపాధి బండ్ల పంపిణీ!
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని వేపూర్ గ్రామంలో పేద కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ఫాస్ట్ ఫుడ్ మొబైల్ బండ్లను పంపిణీ చేశారు. లస్కర్ ఖాజాజీ, యాదగిరి మాధవికి ఒక్కొక్కరికి సుమారు రూ.50 వేల విలువైన ఫాస్ట్‌ఫుడ్ మొబైల్ బండ్లను అందజేశారు.
కల్వకుర్తి మాజీ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ కృషితో ఈ కార్యక్రమం చేపట్టగా, వేపూర్ గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల నాగరాజు, గ్రామ ప్రజలు హన్మంతరావు, తిరుపతిరావు, పి. రాంచంద్రయ్య, ఆ నారయ్య తదితరుల సమక్షంలో బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఉపాధి అవకాశాన్ని కల్పించినందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.




