Kalwakurthy: రైతులకు మెరుగైన సహకారం అందించాలి: మిర్యాల

Kalwakurthy: కల్వకుర్తి నూతన పీఏసీఎస్ చైర్మన్ శ్రీపురం హరిశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేత మిర్యాల శ్రీనివాస్ రెడ్డి సన్మానించి రైతులకు అండగా ఉండాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Nov 2026 2:17 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: రైతులకు మెరుగైన సహకారం అందించాలి: మిర్యాల

నాగర్ కర్నూలు జిల్లా: కల్వకుర్తి మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కల్వకుర్తి ప్రాంత రైతులకు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి కోరారు. కల్వకుర్తి నూతన పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీపురం హరిశ్వర్ రెడ్డిని సోమవారం కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలిచి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY