Devarkadra: ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే!

Devarkadra: దేవరకద్ర మండలం ముచ్చింతల, దాసరిపల్లి గ్రామాల్లో ఎండిపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించి, రైతులను పరామర్శించి భరోసా కల్పించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 5 Nov 2026 3:50 PM IST
Devarkadra
X

Devarkadra: ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే!

Devarkadra: కౌకుంట్ల మండలం ముచ్చింతల, దాసరి పల్లి గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి,రైతులకు భరోసా ఇచ్చిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు తీవ్రంగా నష్టపోయి దుఃఖంలో ఉంటే ఒక్క ఎకరా ఎండిపోలేదంటున్నారు. పంటలు ఎండిపోయింది కనిపిస్తలేదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలవి కూడా ఎండిపోయాయి అని అన్నారు. పంట పెట్టుబడి,బోర్లు వేసినా ఫలితం లేక రెండు రకాలుగా రైతులు నష్టపోయారు.

ఒక్కో గ్రామంలో వందకు పైగా బోర్లు వేసిన చుక్క నీరు రాలేదన్నారు. కరువు మండలాల ప్రకటన చేయడం కాదు...రైతులను ఎట్లా ఆదుకుంటారో చెప్పండని ప్రశ్నించారు. రైతులను పరామర్శిస్తున్న మమ్మల్ని విమర్శించడం కాదు.ఎమ్మెల్యే గ్రామాల్లోకి వెళ్ళి చూడాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ మీ వైఫల్యం వల్లే ఈ దుస్థితి. కృష్ణా జలాలు ఒడిసి పట్టలేని అసమర్థ ప్రభుత్వం. కృష్ణా నదీ పక్కనే ఉన్నా పంటలు ఎండిపోయాయి. నీటిని ఎత్తిపోయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులు,రైతు కూలీలను ఆదుకోవాలని కోరారు.

యాసంగి పంటలు వేస్తే కరెంట్, నీళ్ళు అడగొద్దని రైతులను డిక్లరేషన్ అడుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఓటు అడగమని డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రాప్ హాలిడే ఇస్తే... కాంగ్రెస్ కి కూడా ప్రజలు ఇక సెలవు అంటారు.

కందూరు పెద్ద వాగుకు కృష్ణా నీళ్ళు తీసుకురాలేదు. ఊక చెట్టు వాగును కూడా ఎండబెట్టారు. రైతులకు నీళ్ళు ఇవ్వాలనే సోయి లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA