Nagarkurnool: ఊర్కొండలో మృతురాలి కుటుంబానికి డీఎన్‌ఆర్ ఆర్థిక సాయం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతిచెందిన యాదమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్).
Nagarkurnool: ఊర్కొండలో మృతురాలి కుటుంబానికి డీఎన్‌ఆర్ ఆర్థిక సాయం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన బండి యాదమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్) మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచి, ఆపద సమయంలో సహాయం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు పోలె రాజు, వార్డు సభ్యులు అంజయ్య, వెంకటేష్, అభివర్మ, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, నాయకులు భాస్కర్, బ్రహ్మం, సహదేవ్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.




