Urkonda: ప్రమాదంలో మృతి చెందిన రూపేష్ కుటుంబానికి డీఎన్‌ఆర్ ఆర్థిక సాయం!

Urkonda: నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో ప్రమాదంలో మృతి చెందిన రూపేష్ కుటుంబాన్ని ఆదుకున్న ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్).

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 3:15 PM IST
Urkonda
X

Urkonda: ప్రమాదంలో మృతి చెందిన రూపేష్ కుటుంబానికి డీఎన్‌ఆర్ ఆర్థిక సాయం!

Urkonda: నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన డి. రూపేష్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్) మృతుడి కుటుంబానికి అండగా నిలిచారు.

కాంగ్రెస్ నాయకుల ద్వారా మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంగయ్య, వార్డు సభ్యులు శివ, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, గణేష్, పురుషోత్తం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY