Nagarkurnool: కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు!

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో అనారోగ్యంతో మృతిచెందిన దేవాలయ అటెండర్ కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) ఆర్థిక సహాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 Sept 2026 10:36 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు!

Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన జుంటుపల్లి ఆంజనేయులు దేవాలయం అటెండర్ అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు శ్రీ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు. అదేవిధంగా గ్రామ వాస్తవ్యులు హైదరాబాద్ స్థిర నివాసం ఏర్పరుచుకుని అనునిత్యం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కుంభర్తి జానకిరామ్ రూ.8000/- మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్, చిన్న బాలయ్య, ఆరేడ్ల జయమ్మ, వార్డు సభ్యులు కప్పెర సురేందర్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మాసుం తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY