Devarakadra: ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం గోశాలకు ట్రాక్టర్ గడ్డి వితరణ!

Devarakadra: దేవరకద్ర శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం గోశాలకు దాత శాలి వీరాంజనేయులు దంపతులు ఒక ట్రాక్టర్ గడ్డిని విరాళంగా అందజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 17 Nov 2026 10:30 AM IST
Devarakadra
X

Devarakadra: ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం గోశాలకు ట్రాక్టర్ గడ్డి వితరణ!

Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం గోశాలకు ఒక ట్రాక్టర్ గడ్డి సమర్పించిన శ్రీమతి శాలి తిమ్మమ్మ కుమారుడు శ్రీ శాలి వీరాంజనేయులు ధర్మపత్ని శ్రీమతి మల్లేశ్వరి వారికి వారి కుటుంబ సభ్యులకు సద్గురు ఈశ్వర వీరప్పయ్య స్వామి మరియు గోమాతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు నాగరాజు, నాగభూషణం ఆశీర్వదించారు.

దాతలు ఎవరైనా గోశాలకు గడ్డిని సమర్పించి గోవుల రక్షణకు పాటుపడాలని శ్రీశ్రీశ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శివానంద చారి తెలిపారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA