Achampet: అచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన, శంకుస్థాపనలు!
Achampet: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. మన్ననూర్, అచ్చంపేటలలో సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల వివరాలు.
Achampet: అచ్చంపేటలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన, శంకుస్థాపనలు!
Achampet: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన మన్ననూర్‌కు చేరుకుంటారు. అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
హాజీపూర్ నుంచి మన్ననూర్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మన్ననూర్ నుంచి హాజీపూర్ వెళ్లే మార్గంలో ఉన్న దర్గా, శివాలయాన్ని ఆయన సందర్శిస్తారు. మన్ననూర్‌లో 220/30 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసి, ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమ్రాబాద్‌కు చేరుకొని ఆర్ అండ్ బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్రాబాద్ నుంచి పదర మండలం జ్యోతి నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయ గోపురం పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయలగండి నుంచి మన్ననూర్ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని భోజన విరామం అనంతరం అచ్చంపేట పట్టణానికి బయలుదేరుతారు. అచ్చంపేటలో 33/11 కేవీ ఐడీపీఎస్ సబ్‌స్టేషన్ షిఫ్టింగ్‌తో పాటు, 33/11 కేవీ సిద్ధాపూర్, రామాంజిపల్లి, తిప్పారెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న నూతన సబ్స్టేషన్లకు ఆయన శంకుస్థాపన చేస్తారు.




