Devarakadra: రూ. 1,21,116 లకు లడ్డూ దక్కించుకున్న గుద్దేటి మంజులా రాణి!

Devarakadra: దేవరకద్ర వాసవి మాత ఆలయ వినాయకుని లడ్డూ వేలం. రూ. 1,21,116 లకు దక్కించుకున్న జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గుద్దేటి మంజులా రాణి సాయిబాబా దంపతులు.

GOKARANNA,  GADWAL
Published on: 22 Sept 2026 4:01 PM IST
Devarakadra
X

Devarakadra: రూ. 1,21,116 లకు లడ్డూ దక్కించుకున్న గుద్దేటి మంజులా రాణి!

దేవరకద్ర: దేవరకద్ర వాసవి మాత దేవాలయం లో ప్రతిష్టించిన వినాయకుడికి తొమ్మిది రోజులపాటు ఆర్యవైశ్యులందరూ ఘనంగా పూజలు నిర్వహించారు. నేడు వినాయకుని నిమజ్జనాన్ని పురస్కరించుకొని లడ్డూ వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో ఒక్క లక్ష ఇరవై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలకు దేవరకద్ర వాస్తవ్యురాలు జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు గుద్దేటి మంజులా రాణి సాయిబాబా దంపతులు దక్కించుకున్నారు.

దేవరకద్ర మున్సిపాలిటీ ప్రజలందరిపై ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని, తలపెట్టిన ప్రతి పనిలో ఎలాంటి విజ్ఞాలు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా గుద్దేటి మంజులా రాణి వినాయకుడిని కోరుకున్నామన్నారు. ఈ సందర్భంగా వారి దంపతులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఆర్యవైశ్యులందరూ పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL