Devarakadra: దేవరకద్రలో 'ఇందిరమ్మ ఇండ్ల' దీపావళి వేడుకల ఏర్పాట్లు

Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల వద్ద దీపావళి వేడుకల నిర్వహణకు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 7 Nov 2026 5:36 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో 'ఇందిరమ్మ ఇండ్ల' దీపావళి వేడుకల ఏర్పాట్లు

దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద గృహాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి వేడుకలకు విశేష ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్యాలయం నుండి అందజేసిన స్టిక్కర్లను లబ్ధిదారుల ఇళ్ల గోడలపై అతికించి, వాటి కింద లబ్ధిదారుని పేరు, ఇందిరమ్మ ఇల్లు నంబర్, మంజూరైన సంవత్సరం మరియు ప్రభుత్వ సబ్సిడీ మొత్తం (₹5,00,000) వివరాలను పెయింటర్‌తో స్పష్టంగా రాయించేలా పనులు వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం లబ్ధిదారులు తమ నూతన ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని సూచించారు. స్టిక్కర్, దీపాలతో అలంకరించిన ఇళ్ల ఫోటోలను @Indirammaindlu, @tghd.official, @telanganacmo ఖాతాలకు ట్యాగ్ చేస్తూ #Indirammaindlu, #MaalndirammalntloDeepavali హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని కోరారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో కొండ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. నరేష్ బాబు, వార్డు కౌన్సిలర్లు బీరప్ప , బాలరాజు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులందరూ ఆదివారం సాయంత్రం వార్డులలో అందుబాటులో ఉండి లబ్ధిదారులతో కలిసి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA