Devarakadra: నీటిని పొదుపుగా వాడుకోండి జీనుగురాల గ్రామంలో అధికారుల పర్యటన
Devarakadra: ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీనుగురాల గ్రామంలో ఎంపీడీవో శ్రీనివాసరావు పరిశీలన. నీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి.
Devarakadra: నీటిని పొదుపుగా వాడుకోండి జీనుగురాల గ్రామంలో అధికారుల పర్యటన
దేవరకద్ర: దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో గురువారం రోజు ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఇ నూర్ అహ్మద్ ,గ్రిడ్ఏఈ వినోద్ పర్యటించారు.
ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే ఆయా గ్రామాల్లో అక్కడక్కడ తాగునీటి సమస్యలు మొదలవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కుమ్మరి నాగమ్మ సాయిలు కు తెలియజేశారు.
ఇప్పటికే అడుగంటిన బోర్లను పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని వారు తెలిపారు.




