Devarakadra: దేవరకద్రలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

Devarakadra: దేవరకద్రలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పిలుపు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 23 Oct 2026 8:43 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం!

దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహాహ్ కేంధ్యాల శ్యామ్ ఎమ్మెల్సీ జిల్లా ఇంచార్జ్,TPUS జిల్లా అధ్యక్షుడు కుర్మయ,కొండ ప్రశాంత్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ హాజరయ్యారు.

గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీల పనితీరు నాయకులు, కార్యకర్తలకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం భవిష్యత్తులో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాల కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి కొండ ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి విజయానికి ఓటరు నమోదు ప్రక్రియ కీలకమని పేర్కొన్నారు.

జిల్లాలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,శక్తి కేంద్రం ఇన్చార్జులు,వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA