Devarakadra: కురుమూర్తి స్వామి ఆలయంలో గాలిగోపురం ప్రారంభించిన GMR!
Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థానంలో రూ.75 లక్షలతో నిర్మించిన గాలిగోపురం, దాసంగాల షెడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జియంఆర్ ప్రారంభించారు.
Devarakadra: కురుమూర్తి స్వామి ఆలయంలో గాలిగోపురం ప్రారంభించిన GMR!
దేవరకద్ర: శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద 75 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జియంఆర్. చిన్నచింతకుంట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గాలిగోపురం, దాసంగాల షెడ్యూలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం రూ.25 లక్షల నిధులతో నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, దేవాలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.




