Devarakadra: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ కుటుంబ సభ్యులు
Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కుమార్తె లక్ష్మీ సహస్ర పుట్టినరోజున కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో అన్నదానం.
Devarakadra: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ కుటుంబ సభ్యులు
దేవరకద్ర: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కుమార్తె లక్ష్మీ సహస్ర జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే జియంఆర్ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారిని మొక్కుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు స్వయంగా వడ్డించారు, భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కురుమూర్తి స్వామి భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




