Devarakadra: క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించాలి జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్
Devarakadra: దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ గ్రామంలో ఘనంగా కబడ్డీ పోటీలు. గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేసిన జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్.
Devarakadra: క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించాలి జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్
దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశంతో దసరా పండుగను పురస్కరించుకొని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని మైదానంలో జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్ కబడ్డీ పోటీలు నిర్వహించారు.
చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ టీం రాజమూర్ వారియర్స్ మొదటి బహుమతి గెలుపొందారు. గణేష్ యాదవ్ టీం రెండో బహుమతి గెలుపొందారు. గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు జికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోన రాజశేఖర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ ,క్రీడల వల్ల శారీరక దారుఢ్యం తో పాటు, మానసికోత్సాహం కలుగుతుందని తెలిపారు.
పట్టుదలతో ఆడి జాతీయ స్థాయిలో పథకాలు సాధించి ఇటు గ్రామానికి అటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించినందుకు గాను ఇంద్ర ,గణేష్ యాదవ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లి కురుమయ్య ,నత్తి కురుమయ్య ,బాలస్వామి తోపాటు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.




