Devarakadra: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేవైఎం భిక్షాటన

Devarakadra: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భిక్షాటన చేపట్టింది.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 16 Nov 2026 9:28 PM IST
Devarakadra
X

Devarakadra: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బీజేవైఎం భిక్షాటన

దేవరకద్ర: భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8500 స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరసిస్తూ భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది.

భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల రాము మాట్లాడుతూ ఈరోజు కొట్లాడి సాధించుకున్నా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులని గాలికి వదిలేసిందనే మాట మనందరికీ తెలుసు ఈరోజు స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం తో BRS ప్రభుత్వాన్ని గద్దె దింపింది.

తెలంగాణ రాష్ట్రంలో యువత తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అనే నిదర్శనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి యువత కోసం.. ఆది మర్చిపోవద్దు కేసీఆర్ పోయిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి విద్యార్థులను ఆదుకుంటాడు విద్యార్థుల పక్షాన ఉంటాడని గంపెడు కోరికలు గుప్పెడు ఆశలతో విద్యార్థులు నిరుద్యోగులు వేచి చూస్తూ ఉంటే రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలని వారి భవిష్యత్తుని అంధకారం చేస్తుంది.

ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం హనీ మండిపడ్డారు .ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ప్ మరియు రియంబర్స్మెంట్ విద్యార్థుల బిక్ష కాదు ఆది వారి హక్కు అని మరవద్దు అని హెచ్చరించారు .వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చెయ్యాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం అని హెచ్చరిస్తా ఉన్నా మన్నారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న నాయకులు బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రెటరీ వెంకటేష్, విజయం జిల్లా ఉపాధ్యక్షుడు యశ్వంత్, బిజెపి దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, బీజేవైఎం దేవరకద్ర టౌన్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శ్రీశైలం చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ & కృపాకర్, బీజేవైఎం అడ్డాకల్ మండల అధ్యక్షుడు గట్టు శివ, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సమీర్, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA