Devarakadra: అమరచింతలో 70 మంది పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల సమర్పణ!
Devarakadra: దేవరకద్ర నియోజకవర్గం అమరచింతలో 70 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించిన బీజేపీ నాయకులు.
Devarakadra: అమరచింతలో 70 మంది పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల సమర్పణ!
Devarakadra: బీజేపీ ఆధ్వర్యంలో 70 మంది పట్టభద్రుల ఓటరు దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించిన నాయకులు. అమరచింత మున్సిపాలిటీ మరియు రూరల్ ప్రాంతాలకు చెందిన 70 మంది పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తులను బీజేపీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో పూర్తి చేయడం జరిగింది.
అనంతరం సంబంధిత ధ్రువపత్రాలను ప్రభుత్వ గెజిటెడ్ అధికారులతో ధ్రువీకరించి, సంతకాలు చేయించిన దరఖాస్తు ఫారాలను అమరచింత తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు, కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డితో పాటు బీజేపీ సోషల్ మీడియా వారియర్ కొంగరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో బీజేపీ ఆధ్వర్యంలో ఈ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతోందని ఈ సందర్భంగా వారు తెలిపారు.




