Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: బీజేపీ డిమాండ్

Nagarkurnool: ఎల్‌నినో వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నందున నాగర్‌కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ కిసాన్ మోర్చా కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చింది.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Oct 2026 8:23 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: బీజేపీ డిమాండ్

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ..

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చారకొండ మండలం చెందిన బిజెపి తో పాటు బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నారాయణ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ కి వినతిపత్రం అందజేశారు.

ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి అధ్యక్షులు... వేముల నరేందర్ రావు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు, A రాజేశ్వర్ రెడ్డి, సంగనమోని అన్వేష్, ఉపాధ్యక్షులు సీతారామ్ రెడ్డి గడ్డం శేఖర్ యాదవ్కా, దర్శులు , శ్యామ్ సుందర్ రెడ్డి ఇంద్రకంటి శేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీపాల్ రెడ్డి, కోశాధికారి లోహిత్ రెడ్డి, మీడియా కన్వీనర్ వెంకటేశ్వర్లు సోషల్ మీడియా కన్వీనర్ శ్రీపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY