Pebbear: పెబ్బేరు సంస్కార్ స్కూల్‌లో వినాయక కండువా వివాదం!
Pebbear: పెబ్బేరు సంస్కార్ స్కూల్‌లో వినాయక చవితి కండువా కప్పుకున్న విద్యార్థిపై టీచర్ దాడి ఆరోపణలు. స్కూల్ వద్ద ఏబీవీపీ ఆందోళన, ఎంఈఓ జయరాములుకు లిఖితపూర్వక ఫిర్యాదు.
Pebbear: పెబ్బేరు సంస్కార్ స్కూల్‌లో వినాయక కండువా వివాదం!
పెబ్బెర్: వినాయక చవితి సందర్భంగా కాషాయ కండువా ధరించి పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని ఇంచార్జి మందలించడంతో పాటు, చెంపపై కొట్టినట్లు విద్యార్థి ఆరోపించాడు. ఈ ఘటనపై విద్యార్థి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది.
విషయం తెలుసుకున్న ఎబీవీపీ పెబ్బేరు శాఖ నాయకులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని వివరణ కోరారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా జరిగినట్లు ఎబీవీపీ నాయకులు తెలిపారు.
ఘటనపై, అలాగే పాఠశాల అనుమతులు, రిజిస్ట్రేషన్ అంశాలపై ఎంఈఓ జయరాములుకు ఫిర్యాదు చేసినట్లు ఎబీవీపీ నాయకులు వెల్లడించారు. విద్యార్థి ఘటనపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఈ అంశంపై పాఠశాల యాజమాన్యం వివరణ రావాల్సి ఉంది.




