Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రాల పరిశీలన!

Mahabubnagar: మహబూబ్‌నగర్ డీసీసీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి పరిశీలించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 11 Oct 2026 5:46 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రాల పరిశీలన!

మహబూబ్ నగర్: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది. ​ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు (ఎన్రోల్మెంట్) కేంద్రాన్ని ఉమ్మడి స్థానం ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి సందర్శించారు.

మహబూబ్నగర్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గంలోని జడ్చర్ల,భూత్పూర్, మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్రోల్మెంట్ సెంటర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ​ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు (CWC Member) చల్లా వంశీచంద్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

​ఈ సందర్భంగా చల్లా వంశీచంద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న పట్టభద్రుల ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులందరూ సమన్వయంతో, చిత్తశుద్ధితో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.