Mahabubnagar: సీఎం పై రసమయి బాలకిషన్ వ్యాఖ్యలను ఖండించిన పసుల రాజు!
Mahabubnagar: రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసుల రాజు ఖండించారు.
Mahabubnagar: సీఎం పై రసమయి బాలకిషన్ వ్యాఖ్యలను ఖండించిన పసుల రాజు!
Mahabubnagar: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు రసమయి బాలకిషన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి పై వ్యక్తిగత దూషణలకు దిగడం, నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం రసమయి బాలకిషన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. గతంలో పదవుల్లో ఉండి ప్రజలకు ఏమీ చేయలేని బిఆర్ఎస్ నాయకులు, నేడు అధికారం కోల్పోయామనే నిరాశ, నిస్పృహలతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
రసమయి బాలకిషన్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకులపైగానీ, ముఖ్యమంత్రి గారిపైగానీ ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే కాంగ్రెస్ శ్రేణులు, ఎస్సీ సెల్ నాయకులు చూస్తూ ఊరుకోరు. తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.




