Nagarkurnool: ఊర్కొండ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిఖిల్ రెడ్డి!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Nagarkurnool: ఊర్కొండ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిఖిల్ రెడ్డి!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి - జడ్చర్ల ప్రధాన రహదారిపై వెలసిన హజరత్ సయ్యద్ ఖాజా యూసుఫోద్దీన్ మిర్జాయి చిష్తీ ఖలందరి దర్గాలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ మాజీ వర్కింగ్ అధ్యక్షుడు ద్యాప నిఖిల్ రెడ్డి (డీఎన్‌ఆర్) పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ద్యాప నిఖిల్ రెడ్డిని పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి పాలకమండలి చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్, నర్సంపల్లి సర్పంచ్ శైలజ శ్రీశైలం, యువజన విభాగం మండల అధ్యక్షుడు గుంజ ఆదినారాయణ, కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




