Makthal: మక్తల్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి సైకిల్ పోటీలు!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ ఎల్లమ్మ కుంట–కొత్త గార్లపల్లి రోడ్డులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి 5 కి.మీ., 10 కి.మీ. సైకిల్ పోటీలు జరిగాయి.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Nov 2026 10:20 AM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి సైకిల్ పోటీలు!

Makthal: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి. మల్లారెడ్డి, బి.విజయ కాంతారావు ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఈ రోజు మక్తల్ మున్సిపాలిలోని ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో బాల బాలికలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి రోడ్ స్పీడ్ 5,కి.మీ.10 కిలోమీటర్ల సైకిల్ పోటీలను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి. యాదయ్య యాదవ్, బి.గోపాలం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సైకిల్ పోటీలలో క్రీడా ప్రతిభను చాటిన బాలబాలికలను, ఎంపిక చేసి, డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాదు చౌటుప్పల్ లో జరుగు రాష్ట్ర స్థాయి సైకిల్ పోటీలకు పంపుతామని జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. ఈ సైకిల్ పోటీలలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి 126 మంది బాలబాలికలు పాల్గొన్నట్లు బి.గోపాలం తెలిపారు.

పాల్గొన్న పిడి. ,పి ఈటిలను బి.గోపాలం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత,పీడీలు పీఈటీలు బి. పుష్ప స్వరూప, శ్వేత, బాలమణి, భవ్య, స్వాతి, పరుశురాం సైకిలింగ్ రైడర్స్ 126 మంది పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL