Charlapally: వైభవంగా పడిపూజ.. ఆలయ నిర్మాణానికి రూ.2.51 లక్షల విరాళం!
Charlapally: చర్లపల్లిలో రఘునాథ్ రెడ్డి గురుస్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Charlapally: వైభవంగా పడిపూజ.. ఆలయ నిర్మాణానికి రూ.2.51 లక్షల విరాళం!
Charlapally: చర్లపల్లి గ్రామంలో అయ్యప్ప నామస్మరణ మారుమోగింది. గ్రామానికి చెందిన అయ్యగారి రఘునాథ్ రెడ్డి గురుస్వామి అయ్యప్ప దీక్ష స్వీకరించిన సందర్భంగా బుధవారం రాత్రి గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన అభిషేక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకొని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులతో పాటు చర్లపల్లి గ్రామ సర్పంచ్ సూదిరెడ్డి శోభారాణి శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పీజే బాబు తదితర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి సీనియర్ గురుస్వాములైన యరుమలి శ్రీనివాసులు , కవిందర్ రెడ్డి, ధూపం నాగరాజు , ఉమామహేశ్వర రెడ్డి, మోహన్ రెడ్డి, మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి , శ్యాం సుందర్ గౌడ్ తదితర గురుస్వాములను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అయ్యప్ప సేవాసమితి భజన బృందం రఘుచారి , రవి రెడ్డి గార్ల గనామృతం భక్తులను మైమరపింప చేశాయి .
ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
కొత్తకోట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్ర ఆలయ నిర్మాణానికి శ్రీమతి & శ్రీ అయ్యగారి యాదమ్మ రాం రెడ్డి దంపతుల చేతుల మీదుగా వారి కుమారుడు శ్రీమతి & శ్రీ అయ్యగారి సుస్మిత రఘునాథ్ రెడ్డి దంపతులు రూ.2,51,116 విరాళాన్ని ప్రకటించి, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులైన జోషి గోపాలకృష్ణ గురుస్వామి, దూపం నాగరాజు, కవీందర్ రెడ్డి , పొగాకు అనిల్ కుమార్ , సత్యం సాగర్ గర్లకు అందజేశారు.
అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కేంద్రానికి రూ.25,000 విరాళాన్ని ప్రకటించి శాశ్వత సభ్యత్వాన్ని సైతం నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు అయ్యగారి రఘునాథ్ రెడ్డి, సుస్మిత దంపతులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భక్తి భావంతో పాటు ఆలయ నిర్మాణం, అన్నదాన కార్యక్రమాలకు దాతృత్వాన్ని చాటుకున్న రఘునాథ్ రెడ్డి దంపతులను పలువురు అభినందించారు. కార్యక్రమం లో అర్చకులు రవికాంత్ , అనీల్ , శ్రీకాంత్ మరియు జైపాల్ రెడ్డి , రవి గౌడ్ , లచ్చ గౌడ్ , రాజశేఖర్ , వేముల సంతోష్ గురు స్వాములు పాల్గొన్నారు.




