Achampet: మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం కూల్చివేత – టీఆర్‌పీ నిరసన!

Achampet: మెదక్ జిల్లాలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దుండగులను అరెస్ట్ చేయాలని అచ్చంపేటలో డిమాండ్.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 5:31 PM IST
Achampet
X

Achampet: మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం కూల్చివేత – టీఆర్‌పీ నిరసన!

Achampet: అచ్చంపేట్ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో రాత్రి తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనలో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం దుండగులను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలి బహుజనుల విగ్రహాలను చూసి ఓర్వలేనటువంటి సమాజంలో ఉన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల అనుగదొక్కుతున్నారు అనిచివేస్తున్నారు రాజకీయంగా ఆర్థికంగా నాశనం చేయడమే కాకుండా వారి వర్గాల ప్రజల విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతా ఉన్నాయి.

బడుగు బలహీనవర్గాల ప్రజలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారు చైతన్యవంతులుగా మారుతున్నారని ఈరోజు ఈ కుట్రలు జరుగుతున్నాయి ఇలాంటి కుట్రలు తిప్పికొట్టటానికి బీసీ లందరూ ఏకమవుతున్నారని నినాదం ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోట్లాడండి తప్ప ఆనాటి తెలంగాణ ఉద్యమం అయితే నేమి రజాకారుల ఉద్యమం అయితే నేమి సాయిధ పోరాటాలు అయితే నేమి వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ పోరాటాలలో అసువులు బాసినటువంటి బహుజన ముద్దుబిడ్డ వీరనారి సాకలి విగ్రహం కూల్చడం చాలా బాధాకరమైన విషయం దీనిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమములో అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ బల్మూరు మండల అధ్యక్షుడు అమరేందర్ గౌడ్ అచ్చంపేట టౌన్ ప్రెసిడెంట్ ముద్దముల్ల నిరంజన్ టౌన్ జనరల్ సెక్రెటరీ మదునాగుల రమేష్ తదితరులు డిమాండ్ చేయడం జరిగింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA