Narayanpet: రహదారుల పరిశీలన.. పారిశుద్ధ్యంపై చైర్‌పర్సన్ ఆదేశాలు!
Narayanpet: నారాయణపేట పట్టణ ప్రధాన రహదారులను మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ స్వేత సత్య యాదవ్ పరిశీలించారు.
Narayanpet: రహదారుల పరిశీలన.. పారిశుద్ధ్యంపై చైర్‌పర్సన్ ఆదేశాలు!
Narayanpet: నారాయణపేట జిల్లా జిల్లా కేంద్రంలో నారాయణపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కొండ స్వేత సత్య యాదవ్ గారు పట్టణంలోని వివిధ ప్రధాన రహదారులను సందర్శించి, పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రహదారులపై చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య కార్మికులు క్రమం తప్పకుండా రోడ్లను శుభ్రం చేసి, పట్టణ పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




