Kalwakurthy: నిరుద్యోగుల చలో హైదరాబాద్‌కు అడ్డుకట్ట.. బీఆర్‌ఎస్‌వీ నేత గణేష్ అరెస్ట్!

Kalwakurthy: నిరుద్యోగ జేఏసీ చలో హైదరాబాద్ పిలుపు నేపథ్యంలో కల్వకుర్తిలో బీఆర్‌‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 7:49 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: నిరుద్యోగుల చలో హైదరాబాద్‌కు అడ్డుకట్ట.. బీఆర్‌ఎస్‌వీ నేత గణేష్ అరెస్ట్!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కల్వకుర్తి పోలీసులు బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్‌ను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా దారమోని గణేష్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, స్కూటీ పథకం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

హామీలను అమలు చేయకపోతే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY