Nagarkurnool: మాడుగుల, చారకొండలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సు!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా మాడుగుల, చారకొండలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Nagarkurnool: మాడుగుల, చారకొండలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సు!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ మాడుగుల్, చారకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చారకొండ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అర్హులైన ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, యువ నాయకులకు సూచించారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా నాయకులు బాధ్యతలు తీసుకొని, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజయాన్ని కానుకగా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గురుక జైపాల్ యాదవ్, కల్వకుర్తి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజితా రెడ్డి, గురువయ్య గౌడ్, గజ్జ యాదయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ వార్డ్ మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




