Veldanda: చేర్కూర్ గ్రామంలో మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల పరామర్శ, ఆర్థిక సాయం!

Veldanda: వెల్దండ మండలం చేర్కూర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన నుకం వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించి రూ.7,000 ఆర్థిక సాయం అందించిన బిఆర్ఎస్ నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Nov 2026 10:43 AM IST
Veldanda
X

Veldanda: చేర్కూర్ గ్రామంలో మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ నాయకుల పరామర్శ, ఆర్థిక సాయం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పరిధిలోని చేర్కూర్ గ్రామానికి చెందిన నుకం వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న వెంకటయ్య కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు మరియు మాజీ ఎంపీటీసీ భీమయ్య గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.

అనంతరం మృతుడు కుటుంబ సభ్యులకు 7000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్,దాసరి రమేష్,గొర్రె జంగయ్య,రాజు, జాజాల రామచంద్రయ్య, సాయిలు,పురుగుల శ్రీను, పెద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY