Kalwakurthy: కల్వకుర్తిలో కాషాయ జెండాల ఏర్పాటుకు బీఆర్ఎస్ నేత భారీ విరాళం!
Kalwakurthy: విజయదశమిని పురస్కరించుకుని కల్వకుర్తిలో కాషాయ జెండాల ఏర్పాటు కోసం రూ.25,016 విరాళం అందజేసిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు, కౌన్సిలర్ బావండ్ల మంజులమధు.
Kalwakurthy: కల్వకుర్తిలో కాషాయ జెండాల ఏర్పాటుకు బీఆర్ఎస్ నేత భారీ విరాళం!
Kalwakurthy: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తిని కాషాయంగా మార్చాలని సోమవారం బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, 14వ వార్డు కౌన్సిలర్ బావండ్ల మంజులమధు కాషాయ జెండాలకుగాను రూ. 25016/- లను విరాళంగా హిందూ ఐక్యవేదిక సభ్యులకు అందజేశారు. భారతీయ సంప్రదాయంలో కాషాయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, ఆధ్యాత్మికత, ధర్మానికి ప్రతీకగా భావిస్తారన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తి భావాన్ని పెంచాలని ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందజేశామని వారన్నారు. విరాళాన్ని ఇచ్చినందుకు హిందూ ఐక్యవేదిక సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు మురళీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వీరెడ్డి మధు, మహేష్ రెడ్డి, రాఘవేందర్, శ్రీను, దామర్ల శేఖర్ ఉన్నారు.




