Devarakadra: దేవరకద్రలో రూ.174 కోట్ల పనులకు మంత్రుల శంకుస్థాపన
Devarakadra: దేవరకద్రలో రూ.174 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, శ్రీహరి.. బ్రహ్మోస్ యూనిట్ రాక ఎమ్మెల్యే చొరవేనని వెల్లడి.
Devarakadra: దేవరకద్రలో రూ.174 కోట్ల పనులకు మంత్రుల శంకుస్థాపన
Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినీగొనిపల్లి నుంచి కురుమూర్తి వరకు సుమారు రూ.134 కోట్ల వ్యయంతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా ముచ్చింతల నుంచి పరిధిపూర్ వరకు సుమారు రూ.40 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం కురుమూర్తి ఘాట్ రోడ్డు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ నిధులను తీసుకువచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు.మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షం పడకపోవడంతో కరువు సంభవించిందని మంత్రులు అన్నారు.
ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యల పేరుతో బీఆర్‌ఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రాబోయే ఎనిమిది నెలల పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అందులో భాగంగానే కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా దేవరకద్ర నియోజకవర్గంలో 1000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
గత దేవరకద్ర ఎమ్మెల్యే దేవరకద్ర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మధుసూదన్ రెడ్డి గెలిచిన తర్వాతే దేవరకద్ర కు డిగ్రీ కాలేజ్, వంద పడకల ఆసుపత్రి, కోర్టు, చిన్న చింతకుంటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఏటీసీ సెంటర్, జూనియర్ కాలేజ్ లతోపాటు మరెన్నో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ కూడా దేవరకద్ర కు తీసుకురావడంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా తెలిపారు. కనుక మరోసారి దేవరకద్ర ఎమ్మెల్యేను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని దేవరకద్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




