Makthal: బీజేపీ ఎదుగుదల చూసి సీఎం రేవంత్ భయపడుతున్నారు.. నేతలు!
Makthal: మక్తల్లో బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. బీజేపీ ఎదుగుదల చూసి రేవంత్ భయపడుతున్నారని జి బలరామిరెడ్డి, వెంకట రాములు ముదిరాజ్ అన్నారు.
Makthal: బీజేపీ ఎదుగుదల చూసి సీఎం రేవంత్ భయపడుతున్నారు.. నేతలు!
Makthal: భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయం గుర్తుకు వచ్చిందని ఆయన నిద్రలో కూడా కలవర పడుతున్నారని బిజెపి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరామిరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్ పేర్కొన్నారు.
శనివారం మక్తల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభలో బిజెపి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆయన అమాయకత్వానికి నిదర్శనం అన్నారు.
తెలంగాణలో బిజెపి లేదని మీరంటున్నారు కామారెడ్డిలో మిమ్మల్ని మూడవ స్థానానికి నెట్టింది బిజెపి కాదా .?. అని ప్రశ్నించారు. కామారెడ్డిలో మిమ్మల్ని మూడో స్థానంలోకి నెట్టడమే కాకుండా ఇంతకుముందు మీరు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిని కూడా బిజెపి కైవసం చేసుకుంది దీనిని మర్చిపోయారా అని ప్రశ్నించారు.?
గల్లి గొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన మీకు రాబోవు ఎన్నికలలో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉండండి అని హెచ్చరించారు. పైకి డాంబికాలు పలుకుతున్నప్పటికీ లోపల బిజెపి అంటే భయం పుట్టుకొచ్చిందని ఎదవ చేశారు.
తెలంగాణలో బిజెపి ఎక్కడున్న సంగతి ఎన్నికలలో తెలుస్తుంది కొంచెం ఆగండి అని అన్నారు. మీరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది ఇది చాలదా..? అని ప్రశ్నించారు. మహబూ బ్ పార్లమెంటు యొక్క వర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బిజెపి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది.
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్కాజిగిరి మరియు మహబూబునగర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు బిజెపి గెలుచుకుంది ఈ విషయం మర్చిపోకండి అని అన్నారు. కొంచమైనా బిడియం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు.
ఇది మీ రాజకీయ భవిష్యత్తుకే మంచిది కాదని అన్నారు. చౌకబారు మాటలు కట్టిపెట్టి ఒక ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలని, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలని హితువు పలికారు. భవిష్యత్తులో మీకు రాజకీయ సమాధి పెట్టేది బిజెపి మాత్రమే అని గుర్తుపెట్టుకో మన్నారు.
గల్లీ రాజకీయాలు మాని పనికిరాని మాటలు వదిలిపెట్టి పరిపాలనపై దృష్టి పెట్టు కొంచమైనా తెలంగాణ ప్రజలు మన్నిస్తారు తప్ప ఇదే విధంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికలలో కెసిఆర్ కు పట్టిన గతి మీకు పడుతుంది జాగ్రత్త అని హెచ్చరించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి 20 బహిరంగ సభలు పెట్టి మాట్లాడారు చివరకు ఏమైంది?
బిజెపి గెలిచి మీ పరువు తీసింది ఇది చాలదా అని ప్రశ్నించారు. రెండున్నర ఏళ్ళు మాటలతో గడిపారు ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టండి తెలంగాణ ప్రజలు క్షమిస్తారు అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కర్ని స్వామి, మండల అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి జావీద్ హుస్సేన్, ఓబీసీ జిల్లా నాయకులు ఆడం సత్యనారాయణ పాల్గొన్నారు.




