Makthal: మక్తల్‌లో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బీజేపీ..రైతుల ఓటు చోరీపై ఆగ్రహం!

Makthal: సింగిల్ విండో డైరెక్టర్లను నామినేట్ చేస్తూ రేవంత్ ప్రభుత్వం రైతుల ఓటు చోరీకి పాల్పడుతోందని మక్తల్‌లో బీజేపీ జిల్లా నాయకులు బలరామిరెడ్డి, వెంకటరాములు మండిపడ్డారు.

B. NARENDER, MAKTHAL
Published on: 10 Nov 2026 12:41 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బీజేపీ..రైతుల ఓటు చోరీపై ఆగ్రహం!

Makthal: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలాగూ గెలువలేమని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్టర్లను నామినేట్ చేస్తూ సింగిల్ విండో చైర్మన్ పదవులను తమ పార్టీ ఖాతాలు వేసుకోవాలని చూస్తోందని, దీని ద్వారా ఈ ప్రభుత్వం రైతుల ఓటు చోరీకి పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తోందని బిజెపి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరామిరెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్ అన్నారు.

మంగళవారం మక్తల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడి అధికారంలోకి వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ఢిల్లీలోనూ కేరళ తదితర ప్రాంతాలలో ధర్నాలు చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు చీకొడతారని స్పష్టంగా తెలిసిన కాంగ్రెస్ పెద్దలు తెలంగాణలో అక్రమ మార్గం ద్వారా అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

రైతుల ఓట్లను చోరీ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే ఈ విధానానికి స్వస్తి పలికి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని లేనిపక్షంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

రైతుల సభ్యత్వంతో ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేక నామినేటి పద్ధతిని అనుసరిస్తున్నారని ఇది ఎంత మాత్రం న్యాయ సమ్మతం కాదని అన్నారు.ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే సహకార సంఘంలో సభ్యులతో ఎన్నికలు నిర్వహించి గెలవాలని డిమాండ్ చేశారు.దమ్ము లేని ప్రభుత్వం పోటు చోరీ మార్గం ద్వారా గెలవడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సహకార సంఘాలకు రైతుల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒకసారి ఆ రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని హితువు పలికారు.రైతుల ఓట్లను దొంగిలించి దొంగచాటుగా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని కేతువు పలికారు.

ప్రజలంతా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారని, ఇది ముమ్మాటికి నిజం అని వారు అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్ణి స్వామి జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఓ బి సి మోర్చా నాయకులు ఆడం సత్యనారాయణ పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL