Achampet: చండీ హోమం నిర్వహిస్తున్న భవాని దీక్ష గురు స్వామి బాలాజీ గురుస్వామి

Achampet: అచ్చంపేటలో బాలాజీ గురుస్వామి ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించి, ఇరుముడి కట్టిన 20 మంది భవానీ స్వాములు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి బయలుదేరారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 21 Oct 2026 7:33 PM IST
Achampet
X

Achampet: చండీ హోమం నిర్వహిస్తున్న భవాని దీక్ష గురు స్వామి బాలాజీ గురుస్వామి

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని శ్రీ అన్నపూర్ణాదేవి ఆశ్రమ గురుస్వామి బాలాజీ గురుస్వామి ఆధ్వర్యంలో భవానీ స్వాములు భక్తిశ్రద్ధలతో దీక్షా కార్యక్రమాలు నిర్వహించారు. 41 రోజులపాటు దుర్గామాత దీక్ష చేపట్టిన అనంతరం చండీ హోమం నిర్వహించి, బుధవారం పట్టణంలోని భ్రమరాంబ గుడి సమీపంలోని పాత శివాలయంలో ఇరుముడి కట్టే కార్యక్రమాన్ని పూర్తిచేసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు.

బాలాజీ గురుస్వామితో పాటు మరో 20 మంది స్వాములు 42 రోజులపాటు భవానీ దీక్ష చేపట్టి, నిష్ఠతో పూజలు నిర్వహిస్తూ ఉపవాస దీక్షను కొనసాగించారు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమయానికి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు నిండాలని దుర్గామాతను వేడుకున్నట్లు గురుస్వామి తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA