Makthal: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

Makthal: మక్తల్ మండలంలోని బొందలకుంట, సామన్‌పల్లి గ్రామాల్లో సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు వేయించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బీజేపీ నేత బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి.

B. NARENDER, MAKTHAL
Published on: 6 Nov 2026 6:34 PM IST
Makthal
X

Makthal: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

మక్తల్: వారంరోజుల క్రితం మక్తల్ మండలంలోని బొందలకుంట (నర్సిరెడ్డి పల్లి) సర్పంచ్ శ్రీ అశోక్ కుమార్ గారు మరియు సామన్ పల్లి సర్పచ్ శ్రీ తిప్పన్న గారు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ గ్రామంలో వీధి దీపాల ఇబ్బందుల వల్ల చీకటిలో వున్న మా గ్రామాలను హైమాస్ట్ లైట్స్ ద్వారా వెలుగులు నింపాలని కోరగా, దీపావళి పండగలోపు తన స్వంత నిధుల ద్వారా హైమాస్ట్ లైట్స్ వేయిస్తానని మాట ఇచ్చారు.

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మా గ్రామాల్లో హైమాస్ట్ లైట్స్ వేయించిన మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఇట్టి హైమాస్ట్ లైట్స్ ని రేపు (శనివారం 07-11-2026) సాయంత్రం 5 గంటలకు బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారి చేత ప్రారంభిస్తారని ఆయా గ్రామాల సర్పంచులు తెలియజేసారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL